చెత్త

త్రివిక్రమ్ గారి బ్లాగు చదివాను….వారి ఆక్రోశం అర్ధం చేసుకోగలను., దానిని ఇంకొంచెము విపులీకరిస్తాను.

ఈ జాఢ్యం  పట్టుకొన్నది ఒక్క సినిమాలకే కాదు.,  పేరుపొందిన దిన పత్రికలకు, టివి ఛానల్స్ కి కుడా….

మొన్ననే కోర్టు ఆర్డరు కుడా వేసింది….చెత్త విషయాలను, అభ్యంతరక విషయాలను ప్రచురించవద్దు,ప్రసారం చేయవద్దు అని….కానీ….

శుక్రవారం – టైంస్ ఆఫ్ ఇండియా  (Times Of India) lo Angelina’s coming to India for Irrfan” అనే శీర్షిక క్రింద ఉన్న బొమ్మ…

pic

ఇక్కడ సెన్సార్ ఏమైనట్లు? అంజెలీనావి ఇంతకంటె మంచి ఫొటొలు దొరకవా?

శనివారం – యం.టివి (ఇండియా) M.Tv India – సా. 7.30

కార్యక్రమం: ఇష్క్ దివానే (ishq Deewane)
ఇక్కడ పి 3 ( popular peculier pigments ) వాళ్ళ  ప్రేమ కధలు (నిజంగా?)చూపిస్తారు…. అంతవరకు బాగానే ఉంది….కానీ నోట్లొ నోళ్ళు పెట్టుకొనే, ముద్దులని కుడా చూపిస్తారు….వాళ్ళ ముద్దులు మనకి ముద్దా? 

గవర్నమెంటు నిద్దురపోతోందా?, లేక …… వద్దులేండి…బూతులు వస్తున్నాయి.

చివరిగా -   ఛానెల్ [V] – వీరు ఎకంగా వి.జె ల exhibition నే పెట్టేసారు.కావాలంటె ఈ లింకుని నొక్కి చూడండి.

http://show.imagehosting.us/show/1570485/0/nouser_1570/T0_-1_1570485.jpeg

ఇంకెందుకు సెన్సారులు, కోర్టులు, కేసులు, మినిస్టిరీలు ?

Published in:  on August 29, 2006 at 2:37 Leave a Comment

వినాయక చవితి శుభాకాంక్షలు

శుక్లాంబర-ధరం విష్ణుం శశి-వర్ణం చతుర్భుజం !
ప్రసన్న-వదనం ధ్యాయేత్ సర్వ-విఘ్నోపశాంతయే !!

ఇది ఒక విద్యార్ధి పలక….
ఇక్కడేమి వ్రాస్తాడో తనకే తెలియదు….
వ్రాసేది వాడికే తెలియనప్పుడు,మనకేమి అనుకోవద్దు..
ఈ పలక అందరూ చదవవలసిన పలక….
ఎన్నొ అనుమానాలను, ప్రశ్నలను రేకెత్తించే పలక…

అందుకే లంబోదరునకు దండమెట్టుకొని, వ్రాయడానికి కూర్చున్నాను…

మరి మీరందరూ చదివి., నా ప్రశ్నలకు  జవాబులు ఇస్తారు కదూ.

మళ్ళీ కలుద్దాం.

విద్యార్ధి.

Published in:  on August 27, 2006 at 12:11 Comments (1)